Header Banner

తిరుపతి-గుంటూరు-నందిగామలో పురపాలక ఎన్నికలపై ఉత్కంఠ! ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయ వర్గాలు!

  Mon Feb 03, 2025 13:29        Politics

తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎస్వీ వర్సిటీ సెనెట్ హాల్లో కాసేపట్లో ఈ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరించారు. ఎస్వీయూ ప్రధాన గేటు వద్ద పోలీసులు తనిఖీలు చేసి కార్పొరేటర్లను లోపలికి పంపుతున్నారు. పరిపాలనా భవనం వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  మరోవైపు ఎస్వీ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు సెనెట్ హాల్ కు చేరుకున్నారు. వారి బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గుంటూరులో.. గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక్కడ మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. వైకాపాకు 46, తెదేపాకు 9, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 6 స్థాయీ సంఘం సభ్యుల పదవులను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 



కూటమి ప్రభుత్వం వచ్చాక తెదేపా, జనసేనలో పలువురు వైకాపా కార్పొరేటర్లు చేరారు. తొలిసారి స్థాయీసంఘం ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెలువడే ఫలితాలతో ఉత్కంఠకు తెరపడనుంది. నందిగామలో.. నందిగామలో పురపాలక సంఘం ఛైర్పర్సన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. స్థానిక ఫంక్షన్ హాల్లో ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక్కడ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నందిగామ మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉండగా ఇద్దరు కౌన్సిలర్లు చనిపోయారు 18 మంది కౌన్సిలర్లు, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #elections #deputymeyir #thirupathi #guntur #nandhigama #todaynews #flashnews #latestupdate